సంజూ శాంసన్ బ్యాటింగ్‌పై అతడి తండ్రి విశ్వనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కొందరు తమ స్వార్థం కోసం ఆడుతారు. కానీ నా కొడుకు అలా కాదు.. సంజూ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడడు. భారత కెప్టెన్లు MS ధోనీ, కోహ్లీ, రోహిత్, రాహుల్ ద్రవిడ్ నా కొడుక్కి అవకాశాలు ఇవ్వకుండా 10 ఏళ్ల కెరీర్ నాశనం చేశారు’ అని ఆరోపించాడు. కానీ సంజూకి అవకాశం ఇచ్చిన గంభీర్, సూర్యకుమార్‌లకు విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపాడు.