ప్రధాని మోదీకి డొమినికా అత్యున్నత అవార్డు లభించింది. గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో ఆ అవార్డును ప్రదానం చేస్తామని డొమినికా పేర్కొంది. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో డొమినికాకు ఆయన అందించిన సహకారాన్ని గుర్తిస్తూ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇండియా, డొమినికా సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ విశేష కృషి చేశారని ప్రశంసించింది.