అణు చర్చలకు తాము సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ మరికొన్ని వారాల్లో బాధ్యతలు స్వీకరించనున్న వేళ ఇరాన్ చర్చలకు సిద్ధపడటం గమనార్హం. ఇరాన్‌కు వెళ్లిన ఐఏఈఏ చీఫ్ ఇవాళ ఆ దేశ కీలక అధికారులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తాము చర్చల విషయంలో సిద్ధంగా ఉన్నామని.. అంతేకానీ, ఒత్తిళ్లు, భయపడి మాత్రం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బసీ అరాఘీ వెల్లడించారు.