AP: సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా X వేదికగా స్పందించారు. ఎన్నికల వేళ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. యువత, మహిళలను, రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.