TG: దేశ ప్రధానిగా నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్ అన్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ పాఠశాలలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో గత పదేళ్లలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. అనేక చోట్ల సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించామని.. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.