అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మంది మృతి చెందారు. ఈ క్రమంలో అఫ్గాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్థాన్ సరిహద్దుకు పంపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.