AP: 10 రోజుల పాటు VIP దర్శనాలను రద్దు చేస్తూ TTD నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఆ 10 రోజులూ చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, NRI వంటి వారికి కూడా దర్శనాలు ఉండవని పేర్కొంది. ఆ 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపింది.