KRNL: పెద్దకడుబూరు(M) బాపులదొడ్డిలో భూమి వివాదంలో మహిళపై దాడి జరిగింది. ఎమ్మిగనూరుకు చెందిన చంద్రకళ రెండెకరాల భూమిని బైనీ ఈరన్న నుంచి కొనుగోలు చేశారు. అయితే ఆభూమిలో విత్తనాలు వేస్తున్నాడన్న సమాచారంతో వెళ్లిన చంద్రకళను ఈరన్న, అతని భార్య కృష్ణమ్మ కలిసి ఇనుప కొర్రుతో దాడిచేసి, గాయపరిచారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసునమోదు చేసినట్లు SI నిరంజన్ తెలిపారు.