BPT: మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని పలు షాపుల్లో సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ విక్రయిస్తే చర్యలు తప్పవని, జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, ప్లాస్టిక్ రహిత బాపట్ల కోసం సహకరించాలని కోరారు.