నాగర్ కర్నూల్: అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీజేపీ నేతలను ముందస్తు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తమ పార్టీ నాయకుల అరెస్టు హేయమైన చర్య అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని విమర్శించారు.