KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలంలో ఆదివారం వజ్రం దొరికింది. రెండు రోజుల వర్షం తర్వాత, స్థానికులు పొలాల్లో వజ్రాలు వెతకగా ఓ వ్యక్తికి వజ్రం లభించింది. జొన్నగిరి నుంచి వచ్చిన వజ్రాల వ్యాపారస్తుడు ఆ వజ్రాన్ని రూ.1.5 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే, ఆ వజ్రం విలువ సుమారు రూ.5లక్షల వరకు ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.