KRNL: రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు కోడుమూరు సీఐ తబ్రేజ్ అన్నారు. ఆదివారం బురాన్ దొడ్డి, మారందొడ్డి, బ్రాహ్మణదొడ్డి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లు మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. గ్రామాల్లో రచ్చకట్ట పంచాయితీలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై పరమేష్ నాయక్, పోలీసులు ఉన్నారు.