కేంద్ర కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. అయితే గురువారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఇవాళ అధికారిక కార్యక్రమాలను కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించింది.