కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏటా జరుపుకొనే నవంబర్ 14 బాలల దినోత్సవం రద్దుపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సంబంధంలేని రోజును బాలలకు అంకితం చేశారని.. డిసెంబర్ 26న వీరబాల దివస్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 2022లోనే జాతీయస్థాయిలో ఈ ఆలోచన వచ్చిందని.. ప్రధాని మోదీ ఆమోదంతో బాలల దినోత్సవాన్ని మారుస్తామని వెల్లడించారు.