మాజీ ప్రధాని మన్మోహన్ హఠాన్మరణం వార్త విని షాక్కు గురైనట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మన్మోహన్ విజ్ఞానం అపారమని కొనియాడారు. దేశం ఆయన నాయకత్వాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో మన్మోహన్ అగ్రగణ్యుడని కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రశంసించారు. సుదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగిన ఆయన అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు.