దేశంలో పులుల మరణాలు తగ్గినట్లు ఓ నివేదికలో తేలింది. గత ఏడాదిలో మొత్తం 182 పులులు మరణించాయని.. ఈ ఏడాదిలో 122 మరణించినట్లు ఆ నివేదిక పేర్కొంది. వీటిల్లో అత్యధికంగా మధ్యప్రదేశ్లో 44, మహారాష్ట్రలో 21 ఉన్నాయని తెలిపింది. పులుల సంరక్షణపై చర్యలు తీసుకోవటం, అడవుల్లో వేటగాట్లను కట్టడి చేయటం, వణ్యపాణి చట్టాలను కఠినంగా అమలు చేయటం వల్ల పులుల మరణాలు తగ్గినట్లు NTCA చెప్పింది.