PPM: పాలకొండ సబ్ జైలును గురువారం జైలు శాఖ డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ తనిఖీ చేశారు. ముద్దాయిలతో మాట్లాడి, యోగక్షేమాలను తెలుసుకున్నారు. వంటగదిని, వాష్ రూమ్స్, స్టోర్ గదిని డీఐజీ పరిశీలించారు. అనంతరం సబ్ జైల్లో మొక్కలు నాటారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రెండేళ్లకోసారి సాధారణ తనిఖీల్లో భాగంగా సబ్ జైలును సందర్శించినట్లు డీఐజీ చెప్పారు.