మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీ కాలంలో దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి. 3జీ, 4 జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఆయన హయాంలోనే ఊపందుకుంది. వివిధ పథకాల కింద నగదు సహాయాన్ని ప్రభుత్వం ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే(DBT) ప్రక్రియ ప్రారంభమైంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఆయన నేతృత్వంలో అవతరించింది.