పర్యాటకుల సంఖ్యలో ఇప్పటివరకు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాను అయోధ్య అధిగమించింది. ఈ ఏడాదిలో తాజ్‌మహల్‌ను సందర్శించిన వారి కంటే అయోధ్యలో రామ మందిరాన్ని ఎక్కువ మంది దర్శించుకున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయోధ్యను 13.55 మంది సందర్శించినట్లు వెల్లడించింది. వీరిలో 3,153 మంది విదేశీయులు ఉన్నారు.