NLG: కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. నల్గొండలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించి 22 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.