స్కూళ్లకు వెళ్లకుండా, తమ స్థానంలో ఇతరులను పంపుతున్న ఉపాధ్యాయులను గుర్తించినట్లు మధ్యప్రదేశ్ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 500 మంది ఉపాధ్యాయులు ఉన్నారని వెల్లడించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జీతు పట్వారీ మండిపడ్డారు. ఇది సిగ్గు చేటని, ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని కీర్తించటం ఏమిటని ధ్వజమెత్తారు.