స్టార్టప్ కంపెనీల విషయంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా కీలక సూచనలు చేశారు. సరదా వాతావరణంతో కూడిన పని, ఉచిత సలహాలు ఇవ్వడం వంటివాటితో కూడిన స్టార్టప్ రొమాన్స్ కల్చర్ పెరుగుతుందని, దాని ఉచ్చులో పడొద్దన్నారు. నియామకాల్లో సవాళ్లు, ఒత్తిడులతో కూడిన స్టార్టప్ రియాలిటీ కూడా ఉంటుందని వెల్లడించారు.