అమెరికాకు చెందిన దిగ్గజ విమాయాన సంస్థ బోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు షాకిచ్చింది. అంతర్జాతీయంగా సంస్థలో పనిచేస్తున్న వారిలో 10 శాతానికి సమానమైన 17,000 మందిపై వేటు వేస్తూ నిర్ణయించింది. ఈ వారంలో కార్మికులకు లేఆఫ్ నోటీసులను పంపడం ప్రారంభిస్తామని ప్రకటించింది. కాగా.. అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులు స్థానికత నిబంధనలకు అనుగుణంగా 60 రోజుల నోటీసు పీరియడ్‌కు అనుగుణంగా వచ్చే జనవరి వరకూ ఉద్యోగాల్లో కొనసాగుతారు.