ప్రపంచ రెండో సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ నాడు వీరి పెళ్లి జరగనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 54 ఏళ్ల లారెన్ శాంచెజ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. 2018 నుంచే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది.