అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో బుల్డోజర్ చర్యలను ఆపి, చట్టబద్ధమైన పద్ధతిని అనుసరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. అయితే, దీనిపై మంత్రి ఓం ప్రకాశ్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తిని కూల్చలేదని తెలిపారు. అక్రమ ఆస్తులపైకి మాత్రమే బుల్డోజర్లు వెళ్లాయన్నారు. కోర్టుల తీర్పులకు అనుగుణంగానే కూల్చివేతలు జరిగినట్లు వెల్లడించారు.