TPT: తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్థిని స్వగ్రామంలో ఆమె స్నేహితుడు 2 రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అనిత తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో స్నేహితుడి మృతిని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ చెబుతున్నారు.