AP: లిక్కర్ విధానంపై శాసనమండలిలో చర్చ జరుగుతోంది. లిక్కర్ పాలసీని MLC దువ్వాడ శ్రీను తప్పుబట్టారు. దువ్వాడ అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ లిక్కర్ పాలసీ ఏపీలోనే ఉందన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో లిక్కర్ రేట్లు తక్కువగా ఉన్నాయన్నారు. అలాగే, గత ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి చేసినట్లు తెలిపారు. లిక్కర్ స్కాంలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.