AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి లోకేశ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీ అభ్యర్థుల వయో పరిమితిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌లో టీచర్లను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.