ట్రంప్ తన నూతన ప్రభుత్వంలో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు డోజ్ శాఖను అప్పగించారు. అయితే మస్క్, వివేక్ కోసం 80 గంటలు పనిచేసే వారు కావలెను అంటూ ‘X’లో పోస్ట్ వైరల్ అవుతోంది. Xలోని డోజ్ ఖాతాకు అప్లికేషన్స్ పంపాలని పోస్ట్‌లో పేర్కొన్నారు. హై ఐక్యుతో పనిచేసేవారు కావాలని, పార్ట్ టైమ్ ఐడియాలు ఇచ్చేవారు వద్దని ప్రకటించారు. ఎక్స్ ప్రీమియం అకౌంట్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే అర్హులని వెల్లడించారు.