AP: కరవు పీడిత మండలాలపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు ప్రశ్నలు లేవనెత్తనున్నారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానాలు ఇచ్చారు. ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టపోయినట్లు తెలిపారు. అక్టోబర్ 29న 54 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినట్లు చెప్పారు. 1.06 లక్షల హెక్టార్ల పంట, 1.44 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు వివరించారు. రూ.159.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు.