BCCI దెబ్బకు పాకిస్థాన్ పీకల్లోతు కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఛాంపియన్స్ ట్రోఫీకి.. టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించమని ICCకి BCCI స్పష్టం చేసింది. దీంతో పాక్.. హైబ్రిడ్ మోడ్‌కు ఒప్పుకోకుండా, టోర్నీ నిర్వహణ నుంచి తప్పుకుంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. టోర్నీ నిర్వహణ మరో దేశానికి తరలించినా లేదా వాయిదా వేసినా ఆతిథ్య ఫీజు కింద దక్కాల్సిన సుమారు రూ.548 కోట్లు రాకుండా పాకిస్థాన్ నష్టపోతోంది.