BHPL: కాకతీయుల కాలం నాటి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. వేకువజామునే రుద్రేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నందీశ్వరుని దర్శించుకొని ఆలయ ఆవరణలోని మారేడు వృక్షం కింద కార్తీకదీపాలను వెలిగించారు.