SKLM: సోంపేట మండలం కొర్లాం సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోగా డ్రైవర్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.