కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కోహ్లీకి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ‘కోహ్లీకి AUS గడ్డపై అద్భుతమైన రికార్డు ఉంది. అతడు AUSలో ఇప్పటివరకు 13 టెస్టులు ఆడి 50కి పైగా సగటుతో 1352 పరుగులు చేశాడు. కానీ కోహ్లీ మునుపటిలా తొండరపడి వికెట్ ఇవ్వకుండా ప్రశాంతంగా ఆడి సింగిల్స్‌పై దృష్టి పెట్టాలి. రిస్క్ షాట్లు ఆడకుండా జాగ్రత్త పడితే తిరిగి కచ్చితంగా ఫామ్‌ను అందుకోవచ్చు’ అని సూచించాడు.