రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానని అన్నారు. తన పరిపాలనా బృందం ఆ అంశంపై దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ఆ యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించానని, గత మూడేళ్లలో వేలాది మరణించినట్లు తెలిపారు. పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.