AP: టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌పై కోనసీమ జిల్లాలో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్, ఆయన అనుచరులు వేధిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, రాజేష్‌తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.