AP: రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు కొనసాగుతున్నాయి. వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై 30 ఫిర్యాదులు, 10కి పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, నటి శ్రీరెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో టీడీపీ, జనసేన నేతలు 10కి పైగా ఫిర్యాదులు చేశారు. వీటిలో ఐదుచోట్ల కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, మంత్రులపై అభ్యంతరకర పోస్టులు చేశారంటూ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.