TG: 2050 అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. వరద ముప్పు నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు మహా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇప్పుడున్న నాలా వ్యవస్థ రోజుకి 8 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకోగలదు. 2020 అక్టోబరు నెలలో ఒక్కరోజే 19.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతో నగరం అల్లకల్లోలం అయింది. వరద నీటిని తొలుత నగరం చుట్టుపక్కలనున్న చెరువుల్లోకి, అక్కడ నుంచి మూసీలోకి మళ్లించాలని ఆలోచిస్తున్నారు.