దేశంలో రోజురోజుకూ మధుమేహం సమస్య పెరుగుతోందని, అదే విధంగా ఈ వ్యాధిపై అపోహలూ పెరుగుతున్నాయని కాంటినెంటల్ వైద్యులు తెలిపారు. ఈ అపోహలను దూరం చేయడంతోపాటు డయాబెటిస్‌పై అవగాహన కల్పించేందుకు.. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ప్రత్యేక ఛానల్ రూపొందించినట్టు తెలిపారు. చాలామందికి కనీసం డయాబెటిస్ వచ్చినట్లు కూడా తెలియట్లేదని వెల్లడించారు. దీంతో శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుందన్నారు.