W.G: కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం ఇంటర్న్ షిప్’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో (నవంబర్ 15) ముగియనుంది. దీని ద్వారా ప్రభుత్వం టాప్-500 కంపెనీల్లో యువతకు ఏడాది పాటు ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి, 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి ప్రభుత్వం నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది.