ఇరాన్ రాయబారితో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ట్రంప్ హయాంలో ఆ దేశంతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, ట్రంప్ ప్రభుత్వంతో ‘డోజ్’గా బాధ్యతలు నిర్వహించనున్న మస్క్, ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు ఓ అమెరికా పత్రిక పేర్కొంది. గంటకు పైగా వారిద్దరూ ఓ రహస్య ప్రదేశంలో చర్చలు జరిపినట్లు వెల్లడించింది.