TG: లగచర్లలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో లగచర్ల, రోడిబండ, పులిచర్ల గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. ఇప్పటికే కొందరు రైతులు బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకపోవటంతో గ్రామాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. కాగా, రాత్రిపూట గ్రామాల్లోని పరిస్థితులను పరిశీలించిన పోలీసులు.. దాడిలో పాల్గొన్న మరికొందరిని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.