బాలీవుడ్ సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనాటి రోజుల్లో సెట్స్‌లో సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఒక సినిమా కోసం విరేచనాలతో రొమాంటిక్ రెయిన్ సాంగ్ షూట్లో పాల్గొన్నానని.. ఎప్పటికీ దాన్ని మర్చిపోలేనని తెలిపారు.