కృష్ణా: జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా వీ.వీ. నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన ఎస్పీ ఆర్. గంగాధర్‌ను మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన ఎస్పీకు బొకే అందజేశారు. బాధ్యతలు చేపట్టిన వీ.వీ. నాయుడుకు ఎస్పీ అభినందనలు తెలిపారు.