ఆత్మాహుతి డ్రోన్ల వ్యవస్థను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పరిశీలించినట్లుగా కొరియా మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. వీలైనంత త్వరగా వాటి నిర్మాణ వ్యవస్థను నెలకొల్పి, భారీగా ఉత్పత్తి చేయాలని సూచించినట్లుగా కథనాలు వచ్చాయి. కాగా, ఉత్తర కొరియా.. ఆగస్టులోనే ఆత్మాహుతి డ్రోన్లను ఆవిష్కరించింది.