సుగంధ ద్రవ్యాలతో చేసిన టీ ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. లవంగాలతో చేసిన టీ ఎన్నో లాభాలను చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చిగుళ్ల వాపు, పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా నశించి, దుర్వాసన రాకుండా ఉంటుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ దెబ్బతినకుండా కాపాడి, క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తాయి.