స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇకపై మరింత భారమయ్యాయి. MCLR ఆధారిత రుణాల రేట్లను SBI సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.05 శాతం పెంచడంతో 9 శాతానికి చేరింది. 3, 6 నెలల MCLR రేట్లను సైతం ఇంతే మేర పెంచింది. ఓవర్నైట్, ఒక నెల, రెండేళ్లు, మూడేళ్ల MCLR రేట్లను మాత్రం సవరించలేదు. పెరిగిన రేట్లు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయని SBI ప్రకటించింది.