దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో అక్కడ ఇవాళ్టి నుంచి స్టేజ్-3 ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో భవన నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం ఉండనుంది. ఐదో తరగతి వరకు విద్యార్థులకు సెలవు ప్రకటించారు. వారికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ తెలిపారు. కాగా.. కాలుష్యం, పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి నడిచే 300లకు పైగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.