NLR: వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11 మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.