ALR: కొయ్యూరు మండలం వంతమర్రి గ్రామానికి చెందిన వంతాల రాధ అనే నిండు గర్భిణికి గురువారం రాత్రి పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది గర్భిణిని ముందుగా రాజేంద్రపాలెం పీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యంలో ప్రసవించింది.